హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికల జరిపితే ఖబడ్దార్ అంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. బీసీలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని తెలిపారు. అధికారం వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ కులగణన అని చెప్పి కేవలం అసెంబ్లీ తీర్మానంతోనే ప్రభుత్వం సరిపెట్టిందని విమర్శించారు. ఈ విషయంలో బీసీ కమిషన్ ఇప్పటివరకు ఏమి చేసిందో ఎవరికీ తెలియదదని, బీసీ సబ్‌ప్లాన్ జాడే లేదని తెలిపారు. స్థానిక సంస్థలకు 42% రిజర్వేషన్ అమలుకు చట్టపరమైన అడ్డంకులేమీ లేవని అభిప్రాయపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 54 శాతంగా ఉన్నట్టు తేలిందని, దాని ఆధారంగానైనా బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ముందు ఒక ఆర్డినెన్సు జారీ చేయాలని, తర్వాత చట్టం తేవచ్చని సూచించారు. ‘మళ్లీ సమయం లేదంటూ బుకాయిస్తూ పాత రిజర్వేషన్లు అయిన 23 శాతంతోనే ఎన్నికలు జరిపి బీసీలను మోసం చేయాలని చూస్తే కాంగ్రె స్ నేతల బతుకులు పల్లేైర్లెతయ్ ఖబడ్దార్.’ అంటూ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.