గద్వాల, జూలై 17 : నడిగడ్డలోని పలు రిజర్వాయర్లలో పంటకు సరిపడా ఉన్న నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల, ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లు, కాల్వలను ఆయకట్టు రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళా కూలీలు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉండేవారమని, రేవంత్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పతనమైందని మండిపడ్డారు. మళ్లా కేసీఆర్ అధికారంలోకి వస్తేనే రైతుల పరిస్థితులు మారుతాయని అన్నారు. అనంతరం హనుమంతు మాట్లాడుతూ.. పలు రిజర్వాయర్లలో నీళ్లున్నా.. విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.