హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ తీరుపై ఏం చేయాలో చెప్పాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీటి వాడకం, టెలిమెట్రీల ఏర్పాటు వంటివి పరస్పర చర్చలతో రాష్ర్టాలే పరిషరించుకోవాలని ఇటీవల ఇరురాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది.
ఈ క్రమంలో బోర్డు తీరుపై అభిప్రాయం తెలుపాలని కోరుతూ ఇరిగేషన్ అధికారులు తాజాగా ప్రభుత్వానికి లేఖ రాశారు. బోర్డు తీరుపై ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.