హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటుచేయనున్నట్టు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో ‘వరద ప్రాంతాల జోనింగ్’ అంశంపై బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో ఏర్పాటుచేసిన రీజినల్ స్థాయి శిక్షణ శిబిరాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల ఉధృతిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని, ఆధునిక పరిజ్ఞానంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఫేజ్-1 ప్రణాళికలు విడుదలయ్యాయని, అందులో సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను అమలుచేస్తామని వెల్లడించారు.