మహబూబ్ నగర్ : తెలంగాణలో ముఖ్యమంతి కేసీఆర్( KCR ) పదేళ్ల పాలనలో సాగునీరు, విద్యా, వైద్య రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud ) అన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ( Republic day ) సందర్భంగా జాతీయ పతకాన్ని ఎగురవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని దేశానికి అందించారని కొనియాడారు. భారతదేశం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఇతర దేశాలతో సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అక్కడక్కడ మహిళల పట్ల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి చురుకుగా జరిగాయని కొనియాడారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలన యెట్లా ఉందో గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గణేష్, కోట్ల నర్సింహా, వెదవత్, రాము, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.