మోర్తాడ్, జూలై 26: విధి నిర్వహణలో ఉన్న ఇరిగేషన్ ఏఈఈ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్‌కు చెందిన నితిన్ (30) నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఇరిగేషన్ ఏఈఈగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కోనాపూర్ గ్రామశివారులోని రాళ్లవాగులో చెక్‌డ్యాం నిర్మాణం కోసం సర్వే చేస్తుండగా నితిన్ ఒక్కసారిగా కుప్పకూలాడు.
విషయం తెలుసుకున్న సిబ్బంది గ్రామంలోని ఆర్ఎంపీలను పిలిపించి చూపించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. కమ్మర్పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి అక్కడి చేరుకొని ఏఈఈ మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. భౌతికకాయాన్ని శనివారం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. నితిన్ 2024లో ఏఈఈగా ఉద్యోగం సాధించి, నెలరోజుల క్రితమే వివా హం చేసుకున్నాడు. నితిన్ మృతి పై కమ్మర్పల్లి మండల ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.