హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అవినీతిని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయా లి? ఆరోపించిన వారిపైనే ప్రత్యారోపణలు చే యాలి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వై ఖరి ఇలాగే ఉన్నది. మందుల కొనుగోలులో జరిగిన భారీ అవకతవకలను వెలికితీస్తూ ‘నమస్తే తెలంగాణ’ ఏప్రిల్ 28న ప్రచురించిన ‘మందు గోళీ.. వాటాల కేళీ’ కథనం రాష్ట్రవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. టీజీఎంఎస్‌ఐడీసీలో జరిగిన ఈ అవినీతిపై సీఎంవో వ ర్గాలు, వైద్య ఆరోగ్యశాఖ, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ముప్పేట దాడి పెరుగడంతో నష్టనివారణ చర్యలకు దిగిన టీజీఎంఎస్ఐడీసీ.. నిజాలివే అంటూ ‘అబద్ధాలకు’ తెరలేపింది. ‘నమస్తే తెలంగాణ’ కథనంలో ప్రస్తావించిన విషయాలు, ఆరోపణలకు నిర్దిష్టమైన జవాబులు ఇవ్వకుండా.. అక్రమాల నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేసే చర్యలకు టీజీఎంఎస్ఐడీసీ దిగింది. కరోనా సంక్షోభాన్ని తెరమీదకు తీసుకొస్తూ అర్థం లేని వాదనను ముందరేసుకొన్నది. ఈ స్కామ్ జరిగినట్టు తెలిపే అన్ని ఆధారాలను ‘నమస్తే తెలంగాణ’ ఎప్పుడో సంపాదించింది.
అసలేం జరిగిందంటే?
కమీషన్ల ఆశతో మందులను భారీగా కొనుగోలు చేసిన అధికారులు.. అవి ఎక్స్పైరీకి దగ్గర పడటంతో ధ్వంసం చేయడానికి రెడీ అయ్యా రు. దీంతో ఖజానాకు రూ.150 కోట్ల మేర న ష్టం వాటిల్లనున్నట్టు ఏప్రిల్ 28న ‘నమస్తే తె లంగాణ’ ఓ కథనాన్ని ప్రచురించింది. వెంటనే ప్రభుత్వంతోపాటు వైద్యశాఖ అధికారుల్లో కలకలం మొదలైంది. తమ అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు టీజీఎంఎస్ఐడీసీ అధికారులు కథనం ప్రచురితమైన అదే రోజు ‘నమస్తే తెలంగాణ’కు ఓ లేఖ పంపించారు. మందుల కొనుగోలు విషయాన్ని గత బీఆర్ఎస్ సర్కార్‌కు ముడిపెడుతూనే తప్పుడు వివరాలను బహిర్గతం చేస్తూ.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే, దీనిపై ‘నమస్తే తెలంగాణ’ చేసిన లోతైన పరిశోధనలో మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు తాజాగా బయటపడ్డాయి.
లేఖలోనూ అసత్యాలే..
ఈ వ్యవహారంలో 140 జీవోను తుంగలో తొక్కిన అధికారులు.. ‘నమస్తేతెలంగాణకు’కు తాము ఇచ్చిన వివరణ లేఖలో ఎక్కడా ఆ జీ వోను ప్రస్తావించకపోవడం గమనార్హం. జీ వో-140 ప్రకారం అన్ని ఇండెంట్లు, రసీదు లు, జారీ చేసిన మందుల వివరాలు ఈ ఔషధి పోర్టల్‌లో ఉంచాల్సి ఉన్నది. సెంట్రల్ మెడికల్ స్టోర్(సీఎంఎస్)లలో పేరుకుపోయిన కాలం చెల్లిన మందులకు ఇండెంట్లు ఉన్నా యా? లే దా? అనేది తేలాలంటే ఈ-ఔషధి పోర్టల్‌లో తనిఖీలు చేస్తే అసలు నిజాలు తేలనున్నాయి. స్కామ్ నుంచి తప్పించుకునేందు కు టీజీఎంఎస్ఐడీసీ అధికారులు కరోనా సం క్షోభాన్ని కూడా తెరమీదికి తీసుకొచ్చారు. కొ విడ్ సమయంలోనే పెద్ద మొత్తంలో మందు లు కొనుగోలు చేసినట్టు,2021-2022 వరకు కొనుగోలు చేసిన మందులే ఇప్పుడు ఎక్స్పైర్ అ య్యాయన్నారు. ఇదే క్రమంలో గత రెండేండ్ల లో కేవలం రూ.9 లక్షల మందులే కాలం చెల్లాయన్న కొత్త విషయాన్ని బయటపెట్టారు.
ఈ అవినీతి తంతుపై టీజీఎంఎస్ఐడీసీ ఇచ్చిన పొంతన లేని వివరణలపై ‘నమస్తే తెలంగాణ’ మరింత లోతుగా పరిశోధించింది. ఈ క్రమం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 డి సెంబర్ 7 తర్వాత కొనుగోలు చేసి.. కాలం చె ల్లిన కొన్ని మందుల వివరాలను ఎక్స్‌క్లూజివ్ గా సంపాదించింది. లేఖలో ఈ మందులు 2018-19 నుంచి 2022-2023 మధ్య కొ నుగోలు చేసినవని పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్ యాక్ట్ ప్రకారం.. మందుల కాలపరిమితి రెం డేండ్లు మాత్రమే. కొన్ని మందులకు 18 నెల లు ఉంటుంది. టెండర్లలో సైతం మందులకు రెండేండ్ల కాలపరిమితి తప్పనిసరి అనే నిబంధన ఉన్నది. 2021-22లోనే ఈ మందులు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడెలాకాలపరిమితి తీరిపోతుంది? అంటే ఆ మందులను కొవి డ్ టై కాదు.. ఒకట్రెండు సంవత్సరాల కింద టే కొన్నారన్నది వాస్తవం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ మందులను కొనుగోలు చేసినట్టే కదా!.
రంగంలోకి నిఘా వర్గాలు!
‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన నాడే టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయానికి ఐదుగురు ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా వెళ్లి విచారించినట్టు తెలిసింది. ఆ సమయంలో విజిటర్స్ ఎవరినీ కార్యాయలం లోపలికి అనుమతించలేదని సమాచారం. మరోవైపు వైద్యారోగ్యశాఖ పెద్దలు సైతం టీజీఎంఎస్ఐడీసీ ఉన్నతాధికారులను పిలిపించుకుని మందుల కొనుగోలు వ్యవహారంపై ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. ఆ తర్వాతి రోజే టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయానికి హెల్త్ సెక్రటరీ వెళ్లి మందుల కొనుగోలుపై అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
ఈ ప్రశ్నలకు బదులేది?
‘టికగ్రిలోర్’ కొనుగోలులో అవకతవకలు ఇలా..
అక్రమాల తీవ్రత అర్థం కావడానికి ఒక డ్రగ్‌ను ఉదాహరణగా తీసుకుందాం. హార్ట్ ఎ టాక్ రిస్క్ తగ్గించే ‘టికగ్రిలోర్’ ట్యాబ్లెట్‌ను కేవలం కార్డియాలజిస్ట్లే ప్రిస్ర్కైబ్ చేయాలి. టికగ్రిలోర్కు సంబంధించి 2వేల ట్యాబ్లెట్ల కోసం టెండర్ పిలిచి 2024లో 32,76,600 ట్యాబ్లెట్లను కొనగా.. ఆ ఆధారాలను సైతం ‘నమస్తే తెలంగాణ’ సేకరించింది. ఇందుకుగాను రూ.4,71,56,827 చెల్లించినట్టు అధికారులే పేర్కొన్నారు. డీఎంఈ, టీవీవీపీ దవాఖానలు మాత్రమే ఇండెంట్లు ఇవ్వాల్సి ఉండ గా.. డీహెచ్ ఎందుకు ఈ మొత్తానికి ఇండెం ట్లు ఇచ్చారో తేలాలి. ఒకవేళ, 32,76,600 టికగ్రిలోర్ ట్యాబ్లెట్లను కొనుగోలుకు సంబంధించిన ఇండెంట్లు టీజీఎంఎస్ఐడీసీ అధికారులు వద్ద ఉంటే, ఆ ఆధారాలను బయటపెట్టాలనే డిమాండ్ వినిపిస్తున్నది. తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ ఒక్కో టికగ్రిలోర్ ట్యాబ్లెట్‌కు రూ.5 వెచ్చించి కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే, మన రాష్ట్రంలో మాత్రం రూ.14.50 పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్ ధరలను బట్టి చూస్తే ఒక్కో ట్యాబ్లెట్‌కు ఏకంగా రూ.9.50 ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏం వచ్చింది?. ఈ మందుల కొనుగోలుకు టీజీఎంఎస్ఐడీసీ అధికారులు అక్షరాలా రూ.4,71,56,827 చెల్లించగా.. ప్రజా ధనం వృథా చేసిన అధికారులపై చర్యలకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నది తేలాల్సి ఉన్నది.
బీఆర్ఎస్పై దుష్ప్రచారం..
కరోనా సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున మందులు సరఫరా చేసింది. లేఖలో అధికారులు చెప్పినట్టు కరోనా కాలంలో కొనుగోలు చేసిన మందులే ఎక్స్పైరీ అయితే, మందులు సరఫరా చేసిన కంపెనీలు, వారు సరఫరా చేసిన మందులపై బ్యాచ్ నంబర్లు, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలు చూస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. వాటిని బయటపెడితే సరిపోతుంది. రూ.కోట్ల ప్రజాధనాన్ని కాపాడాల్సిందిపోయి, ‘నమస్తే తెలంగాణ’ కథనంతో తమ అవినీతి బయటపడడంతో బీఆర్ఎస్పై దుష్ప్రచారానికి తెగబడ్డారంటూ తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత కాలం చెల్లిన మందుల్లో కొన్నింటి వివరాలు

