Nizamabad | హైదరాబాద్ : నిజామాబాద్ పోలీసు కమిషనర్‌గా వి.సత్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ జాయింట్ సీపీగా వి.సత్యనారాయణ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ తెలిపారు. కొన్ని నెలలుగా నిజామాబాద్ సీపీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఇంచార్జ్ సీపీగా నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.