హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్న పలువురు డీసీపీలతోపాటు ఇద్దరు సీపీలకూ స్థానచలనం తప్పదని పోలీస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు డీసీపీలు ‘ముఖ్యనేత’ భార్యను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. డీజీపీ ఈ నెల30న రిటైర్ కానుండగా కొత్త బాస్ నియామకానికి కసరత్తు చేపట్టారు. దీంతో పైరవీలు జోరందుకున్నట్టు సమాచారం.
బదిలీలు, పదోన్నతులకు తొలగిన అడ్డంకి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఆబారీశాఖలో కొంతకాలంగా అపరిషృతంగా ఉన్న బదిలీలు, పదోన్నతులకు ఆర్థికశాఖ విధించిన అడ్డంకులు తొలగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవతో ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో ఎక్సైజ్‌శాఖలో బదిలీలు, పదోన్నతులకు మంగళవారం మెమో జారీచేశారు. దీంతో ఆ శాఖలో వేలాది మంది బదిలీలకు ఆటంకాలు తొలగాయి. దీంతో మంత్రి జూపల్లికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. రెండేండ్లకోసారి బదిలీ విధానాన్ని కొనసాగించాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, ఆబారీశాఖ ఉగ్యోగులు పాల్గొన్నారు.