RTC workers | ఆర్టీసీ కార్మికులకు బెదిరింపులొద్దు..కూనంనేని సాంబశివరావు
చట్టవిరుద్ధమైన సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణితో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో ఖండించారు.
- చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించండి : కూనంనేని
హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తేతెలంగాణ): చట్టవిరుద్ధమైన సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణితో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో ఖండించారు. కార్మికులపై చర్యలు తీసుకొంటే వారికి అండగా తాము నిలబడుతామని స్పష్టంచేశారు. సమ్మె కార్మికుల ప్రజాస్వామిక హకు అని, అన్నిరకాలుగా తమ ప్రయత్నాల తర్వాతే అనివార్యంగా సమ్మెకు ది గారని పేర్కొన్నారు. ప్రతిష్ఠకు పోకుండా పట్టువిడుపులతో ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలను సత్వరమే పరిషరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ చట్టబద్ధంగా అమలు చేసే అంశమని, గుర్తింపు యూనియన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులు వారి సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి పరిషరించుకునే అవకాశం ఉం టుందన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశాన్ని ఉన్నతాధికారుల కమిటీతో పరిషరించుకోవాలని సూచించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది ; సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపా రు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎదురొంటున్న సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిషరించాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికుల సంక్షేమ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

