హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భా గమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ రాజ్‌తోపాటు లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్హౌస్లపైనా విచారణ చేపట్టాల ని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆయా ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలను రెండు వారాల్లోగా అందివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి తుది నివేదికలు తెప్పించి సమర్పించాలని సూచించింది. పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు ప్రతినిధిని పంపి బరాజ్‌ల నిర్మాణంపై అధ్యయనం చేయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా సత్వరమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తున్నది. ఆ ప్రక్రి య ముగిసిన తర్వాత నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది.