పరిధి దాటిన సిర్పూర్కర్ కమిషన్.. పోలీస్ అధికారుల సంఘం వాదన
దిశ కేసులో జస్టిస్ సిర్పూరర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది.
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దిశ కేసులో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది. ‘దిశ’ నిందితు ల ఎన్‌కౌంటర్‌పై ఆ కమిషన్ నివేదికను సవా లు చేస్తూ పోలీస్ అధికారుల సంఘం దాఖ లు చేసిన పిటిషన్‌తోపాటు ఇతర పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ విచారణకు నాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ప్రస్తుత టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యక్తిగతంగా హాజరయ్యారు.
పోలీస్ అధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. వాస్తవాలను గుర్తించేందుకు మాత్రమే సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటైందన్నారు. కమిషన్ నివేదిక పోలీసుల వృత్తిని తప్పుపట్టేలా ఉన్నదన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా కేసు పెట్టాలని ఇతర పిటిషనర్లకు కమిషన్ సూచించిందని, వారి వాదన వినేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. సజ్జనార్‌తోపాటు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, షాద్‌నగర్ పోలీసులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. విచారణను 21కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

