ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:56

గురుకులాల జయకేతనం

గురుకులాల జయకేతనం

  • ఇంటర్‌లో సత్తా చాటిన ‘సంక్షేమ’ విద్యార్థులు
  • బీసీ జూనియర్‌ కాలేజీల్లో 91.17% ఉత్తీర్ణత
  • గిరిజన కాలేజీల్లో 85.08%.. నాలుగింట 100%
  • ఎస్సీ గురుకులాల్లో 89.38 శాతం పాస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరుతున్నది. ఇంటర్‌ ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు అధిక మార్కులతో అత్యధిక ఉత్తీర్ణత నమోదుచేశారు. మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల విద్యాలయాలసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ఇంటర్‌ సెకండియర్‌లో 2,212 మంది పరీక్ష రాయగా 2,030 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతశాతం 91.77 శాతంగా ఉన్నది. నాగార్జునసాగర్‌ బీసీ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. జూనియర్‌ఇంటర్‌లో 2,329 మంది పరీక్షరాయగా 2,033 ఉత్తీర్ణులయ్యారు. 

ఫస్టియర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత 87.29 శాతంగా ఉన్నది. గిరిజన గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని జూనియర్‌ కళాశాలలకు చెందిన సెకండియర్‌ విద్యార్థులు 4,492 మంది పరీక్షరాయగా 3,822 మంది 85.08 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే 2.72 శాతం పెరిగింది. 4 కళాశాలల్లో వందశాతం, 20 కళాశాలల్లో 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎస్సీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలల పరిధిలో సెకండియర్‌ విద్యార్థులు 10,064 మం ది పరీక్ష రాయగా 8,996 మంది (89.38 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే 5.07 శాతం ఉత్తీర్ణత పెరిగింది. 21 కళాశాలల్లో వంద శాతం, 17 కళాశాలల్లో 90 శాతం పాసయ్యారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు అభినందించారు.


బీసీ గురుకులాల్లో ప్రతిభావంతులు 

ఇంటర్‌ సెకండియర్‌ ఎంపీసీలో పీ గణేశ్‌ 989, బైపీసీలో జీ రవితేజ 983,   ఎంఈసీలో పీ రాణాప్రతాప్‌ 973, సీఈసీలో కే భాస్కరాచారి 974 మార్కులు సాధించారు.

గిరిజన గురుకులాల్లో..

సెకండియర్‌ ఎంపీసీలో వినోద్‌, గణేశ్‌ 982, బైపీసీలో కే ప్రదీప్‌కుమార్‌ 977, సీఈసీలో వెంకటరమణ 938, హెచ్‌ఈసీలో సుకన్య 929 మార్కులు సాధించారు. 

ఎస్సీ గురుకులాల్లో..

సెకండియర్‌ ఎంపీసీలో నరేశ్‌, నిరంజన్‌ 988, బైపీసీలో ఎస్‌ శ్రీజ 987, ఎంఈసీలో డీ సాయికిరణ్‌ 977, సీఈసీలో స్వామి 958, హెచ్‌ఈసీలో వనిత 897 మార్కులు సాధించారు. 

9 గురుకులాల్లో 100 శాతం ఫలితాలు

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 35 తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో తొమ్మిది కాలేజీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 2,490 మంది పరీక్షలకు హాజరు కాగా 2,374 మంది ఉత్తీర్ణత సాధించారు. 95.3 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీ కార్యదర్శి వెంకటేశ్వరశర్మ తెలిపారు. ఇది రాష్ట్ర సగటు 68.86 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. 75 శాతం మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించారని వారంతా ఏ గ్రేడ్‌లో నిలిచారన్నారు. ప్రథమ సంవత్సరం రెండు కాలేజీల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. 2,582 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 90.9 శాతం పాసయ్యారని తెలిపారు. సెకండియర్‌ ఎంపీసీలో కే శివాని 988, కే మహాలక్ష్మీ 987, వై వర్ష 979 మార్కులు సాధించారు. బైపీసీలో డీ శ్రీష 981, కే రవళి 979మార్కులు సాధించారు. ఎంఈసీలో కే సాయిచందన  976 మార్కులు సాధించారు.

ఇంటర్‌ సెకండియర్‌ టాప్‌ ర్యాంకర్లు వీళ్లే..

ఎంపీసీ గ్రూపు

సామినేని ఆదిత్యప్రకాశ్‌ 
992
గుర్లే వైష్ణవి 
992
పుట్టపాక శశాంక్‌ 
992 
సంజుక్త అనీమ్‌ 
992
కత్తి కల్యాణి 
992

బైపీసీ గ్రూపు

ర్యాకం కృషిత 
992
చిందం లిఖిత 
991
ఎడ్ల స్రవంతి 
991
మారునేని శ్రీపాద 
991
మహ్‌రోజ్‌ నిసా 
991 

సీఈసీ గ్రూపు

చిలుక శ్రీజ 
980
సనియా ప్రవీణ్‌ 
979
మహజబీన్‌ 
976 
కవితా గెహ్లాట్‌ 
976
అస్ర నౌరిన్‌ 
976 

హెచ్‌ఈసీ గ్రూప్‌

మురుశెట్టి హిమబిందు 
960
జొన్నలగడ్డ అనురాధ 
958
పాపట్ల ఆకాశ్‌ 
955
ఫాతిమా దరక్‌షాన్‌ 
953
గూడ సింధు 
948  

ఎంఈసీ గ్రూప్‌

ధల్వాలే అమిషాసింగ్‌ 
986
లియా అన్నథామస్‌  
985
దేవా కిశోర్‌ 
985
పొన్నబోయిన మాధవి 
985
పీఎస్వీ బీనా కామేశ్వరి 
984


logo