షాద్‌నగర్, డిసెంబర్ 21 : ధ్యానంతో అంతర్గత శాంతి లభిస్తుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాశాంతి వనంలోని రామకృష్ణ మిషన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్‌బాబు తో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి రాధాకృష్ణ ధ్యానంతో మన స్సు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.