కంది, డిసెంబర్ 5 : సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో ఎనర్జీ ట్రాన్స్మిషన్ అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్(ఐఐఎం) 79వ వార్షిక సాంకేతిక సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనున్నది. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, యూఎస్ఏ, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో నిపుణులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ రంగాల్లో పెరుగుతున్న పరిశోధనా శక్తిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌పై పరిశోధనల వేగం పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. సింగరేణి సీఎండీ బలరాం దేశంలో కీలక ఖనిజాల ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. 45 సంస్థల నుంచి తయారు చేసిన ఆధునిక విశ్లేషణ పరికరాలు, తయారీ సాంకేతికతల ప్రదర్శనలను ప్రారంభించారు.