హైదరాబాద్ : అర్ధరాత్రి గిరిజన బాలికల హాస్టల్ భవనం పైనుంచి దూకడంతో ఇంటర్ విద్యార్థిని గాయపడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో చోటు చేసుకుది. ఈ ప్రమాదంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థినికి తీవ్ర గాయమైంది.
తొలుత స్థానికంగా ఉన్న ప్రభుత్వ జిల్లా దవాఖానకు తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు. విద్యార్థిని భవనం పై నుంచి ఎందుకు దూకింది అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.
అర్ధరాత్రి గిరిజన బాలికల హాస్టల్ భవనం పైనుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్ గుర్తి గ్రామ సమీపంలో ఉన్న హాస్టల్లో ఘటన
ఈ ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయమై ఎముక విరగడంతో తొలుత స్థానికంగా ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం… pic.twitter.com/IUE5yJHQok
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026