కమాన్‌చౌరస్తా, జూలై 21 : కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) టీ రాజ్యలక్ష్మి శుక్రవారం హఠాన్మరణం చెందారు. ఉదయం విధులకు హాజరయ్యే క్రమంలో అల్పాహారం తీసుకుంటూ కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.
రాజ్యలక్ష్మి టైపిస్ట్‌గా ఉద్యోగంలో చేరి, జూనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్, డీఐఈవోగా ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో సేవలందించారు. ఆమె స్వస్థలం సిరిసిల్ల కాగా, 30 సంవత్సరాలుగా కరీంనగర్‌లోని చైతన్యపురి కాలనీలో స్థిరపడ్డారు. రాజ్యలక్ష్మి మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం ప్రకటించారు.