పేదలకు మెరుగైన వైద్యమందించాల్సిన పీహెచ్సీ, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ పెంచికల్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెలవుపత్రాలు లేకుండానే వైద్యులతో పాటు సిబ్బంది గైర్హాజరు కాగా, అక్కడికి వచ్చిన రోగులు నిరాశతో వెనుదిరగడం కనిపించింది. ఇక హెచ్‌ఈవో, జూనియర్ అసిస్టెంట్ జాయినింగ్ నుంచే విధులకు డుమ్మా కొడుతుండగా, రిజిష్టర్‌లో సంతకాలు ఉండడం విమర్శలకు తావిస్తున్నది.
పెంచికల్పేట్, ఆగస్టు14 : కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ డాక్టర్.. జనరల్ డాక్టర్, హెల్త్ సూపర్వైజర్, హెచ్‌ఈవో, ఫార్మసిస్ట్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు స్టాఫ్ నర్సు, నర్సు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు సుమారు 60 నుంచి 100 మంది వరకూ రోగులు వస్తూ ఉంటా రు. ఇక్కడ ప్రతీ శుక్రవారం వారసంత ఉంటుంది. ఆ రోజు హాస్పిటల్‌కు వచ్చే వారి సంఖ్య కూడా ఎ క్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ హాస్పిటల్‌ను విజిట్ చేసింది. అదే సమయంలో దవాఖానకు వచ్చిన కొందరు రో గులు తిరిగి వెళ్తూ కనిపించారు. వారిని పలకరించ గా, ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు లేరు.. అందుకే చూపించుకోకుండానే వెళ్లిపోతున్నామంటూ సమాధానమిచ్చారు. ఆయుష్ డాక్టర్ వచ్చినా.. 11 గం టల వరకే వెళ్లిపోయారు. ఇక ఫార్మసిస్ట్, స్టాఫ్ న ర్సు, ఏఎన్ఎం, డాటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా వారు ఎలాంటి సెలవు పత్రం లేకుండానే.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరయ్యారు. వైద్యాధికారి.. జిల్లా కేంద్రంలో ఎన్సీడీ మీటింగ్ ఉందని సిబ్బందికి చెప్పి హాస్పటల్‌కు రాలేదు.
ముఖ్యంగా సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమే పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక మిగతా రోజుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్లిపోతారో తెలియిని పరిస్థితి నెలకొన్నది. ఉన్నతాధికారులకు సమాచారమివ్వకుండానే విధులకు గైర్హాజరవుతారు. ఇక హెచ్‌ఈవో, జూనియర్ అసిస్టెంట్ అసలు జాయినింగ్ నుంచే హాజరుకాకపోవడం గమనార్హం. వీరు డిప్యూటేషన్‌పై వెళ్లారని చెబుతుండగా, రిజిస్టర్లో మాత్రం హాజరవుతున్నట్లు సంతకాలు ఉండడం గమనార్హం.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎలాంటి మీటింగ్ లేదు. అయినా మేము ఎవరినీ జిల్లా కేంద్రానికి రావాలని చెప్పం. సిబ్బం ది గైర్హాజరుపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలి. విధులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు.
– నాగేందర్, జిల్లా వైద్యాధికారి, ఆసిఫాబాద్