హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ కాలేజీలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సెలవులిచ్చారు. కాలేజీలు తిరిగి ఈ నెల 17న పునఃప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ప్రకటనలో తెలిపారు. సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు పరికరాలు, సా మగ్రిని త్వరగా చేరవేసేందుకు రాష్ట్రం లో రెండు ట్రాన్స్‌కో మెటీరియల్ స్టోర్స్ ను ఏర్పాటు చేయాలని ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సు ల్తానియా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ట్రాన్స్‌కో సెంట్రల్ స్టోర్ ఉండగా, మరో రెండు స్టోర్స్‌ను ఏర్పాటుచేయాలని సూచించారు. విద్యుత్తుశాఖ వేసవి యాక్షన్ ప్లా న్పై మంగళవారం సుల్తానియా విద్యు త్తు సౌధలో సమీక్షించారు. విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించేందుకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు.