Nagarkurnool | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చిట్యాల రాజేష్(22) అనే యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంట్లో చదువుకుంటున్న విద్యార్థినిపై యువకుడు అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించగా, విద్యార్థిని అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు. గత గురువారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.