కోరుట్ల, అక్టోబర్ 29: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడం తో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్నది. ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఓ బాలిక (17) ఇంటర్ చదువుతున్నది. నందీశ్వర్ ప్రేమ పేరుతో వేధిస్తూ బాలిక వెంటపడుతున్నాడు. పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా పద్ధతి మార్చుకోలేదు. బుధవారం బాలిక తల్లి నిర్వహిస్తున్న కిరాణాషాపు వద్దకు వచ్చిన యువకుడు బాలికను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.