అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళ ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
జడ్చర్లటౌన్, మే 19 : ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళ ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. హర్యానాకు చెందిన సందీప్, అశోక్, ప్రవీణ్, రాజేశ్, సునీల్‌కుమార్, సచిన్ కలసి కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కే మహిళా ప్రయాణికుల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఠా నాయకుడు సందీప్ గతంలో హైదరాబాద్, ఆదిలాబాద్, విశాఖపట్నం జిల్లాలో 5 దొంగతనం కేసుల్లో పట్టుబడి జైలు కెళ్లొచ్చాడు. నిందితుల నుంచి కియా కారు, 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

