Sonam Wangchuk : పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలో జవాబుదారీతనం కోరుతూ అమరణ నిరాహార దీక్షకు పూనుకున్న ఆయనను.. హైకోర్టు ఆదేశాలనుసారం ప్రైవేట్ హాస్పిటల్‌కు అప్పగించారు సప్ధర్‌జంగ్ వైద్యులు. మంగళవారం సాయంత్రం 6:40 గంటల సమయంలో సోనమ్‌కు అందించిన చికిత్స వివరాలతో కూడిన హెల్త్ బులెటిన్‌ను తదుపరి ఆయన చేరనున్న మోదాంత ఆస్పత్రి వైద్యులకు అప్పగించారు.
జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు హైకోర్టు ఆదేశాలతో బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. తన భర్తను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనుమతి కోరుతూ అన్మోగ్ గీతాంజలి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో.. దేశంలోని పౌరులకు తమకు నచ్చిన చోట చికిత్స తీసుకునే హక్కు ఉందని పేర్కొన్న ధర్మాసనం సోనమ్‌ను తరలించేందుకు అనుమతిచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పలేదు.
#NewDelhi | Sonam Wangchuk has been discharged from VMMC & Safdarjung Hospital today at 06:40 PM and has been handed over to the team of doctors from Medanta Hospital, Gurugram for further medical care as per the order dated 21.07.2026 of Delhi High Court.
At the time of… pic.twitter.com/svDa9DC45q
— DD News (@DDNewslive) July 21, 2026
కోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేయడంతో పాటు.. చికిత్స వివరాలను సమర్పించారు. ‘సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయానికి సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే.. పాంక్టోపేనియా సమస్య అలానే ఉంది. ఆయన సీరమ్ పొటాషియం నిల్వలు 3.4 mEq/L ఉన్నాయి. సోనమ్‌కు ఇక్కడ అందించిన వైద్య చికిత్స వివరాల కాపీలను, పరిశోధనాత్మక నివేదికలను, చికిత్సకు సంబంధించిన డాక్యుమెంట్లను మోదాంత ఆస్పత్రికి వైద్య బృందానికి సమర్పించాం. తదుపరి సోనమ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేలా వారికి మేము అవసరమైన వైద్య నివేదికలను అందించాం’ అని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
VIDEO | Gurugram: Activist Sonam Wangchuk arrives at Medanta Hospital after Delhi High Court ordered his immediate shifting from Safdarjung Hospital. Wangchuk has been on an indefinite fast since June 28 over alleged examination irregularities.#SonamWangchuk pic.twitter.com/cOF7Tu7O2r
— Press Trust of India (@PTI_News) July 21, 2026