Mahua Moitra | రాజీనామా లేఖ ఎలా రాయాలో విద్యామంత్రికి తెలియదేమో : మహువా మొయిత్రా
Mahua Moitra | ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) మహువా మొయిత్రా (Mahua Moitra) సెటైర్లు వేశారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహుశా తెలియదేమోనని ఎద్దేవా చేశారు.
Mahua Moitra : ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhaan) పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (TMC MP) మహువా మొయిత్రా (Mahua Moitra) సెటైర్లు వేశారు. రాజీనామా లేఖ ఎలా రాయాలో ఆయనకు బహుశా తెలియదేమోనని ఎద్దేవా చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా, విద్యావ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి.
పార్లమెంట్‌వైపు సాగిన ‘చలో సంసద్’ మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించడం కోసమే ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని, ఇరవై మందికిపైగా విద్యార్థుల మరణాలకు ఆయనే బాధ్యుడని సీజేపీ ఆరోపించింది. మరోవైపు కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష 24వ రోజుకు చేరుకుంది. భద్రతా సిబ్బంది ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా వాలంటీర్లు ఆందోళన స్థలాన్ని శుభ్రంచేస్తూ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాజకీయ ఒత్తిడి మరింత పెరుగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

