Inter Exams | హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 1వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఏప్రిల్ 30వ తేదీతో అంటే నేటితో పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ముగియనుంది. కానీ మరో రోజు అవకాశం కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, సెకండియర్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 2025 జూన్ 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్నారు.