Cold Wave | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.5, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదేస్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మంచింగిపుట్టులో 9, మినుమూలూరులో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.