ఠారెత్తిస్తున్న ఎండలు మరో వారం రోజులు ఇదే పరిస్థితి
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వారం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది.
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వారం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం సాయం త్రం బలహీనపడింది. రానున్న రెం డు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని మరికొన్ని ప్రాం తాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సము ద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాం తాల్లోకి ప్రవేశించడానికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
5 జిల్లాలకు రెడ్ అలర్ట్
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రాష్ట్రంలో ఆదివారం నిర్మల్ జిల్లా తానూర్లో అత్యధికంగా 45.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా థారోజ్లో 45.5, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 45.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది మేతో పోలిస్తే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

