హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో పలు మార్పులు చేశారు. గత సీఎం వాడిన పాత తెల్లరంగు ఫార్చూనర్లకు నల్లరంగుతో రీపెయింటింగ్ వేయించారు. ఆ కార్లలోనే సీఎం పర్యటనలు చేస్తున్నారు. దీనితోపాటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 54 మంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా తొలగించినట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి మినహా మిగతావారిని తొలగించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సీఎం భద్రత కోసం 55 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో 10 మంది ఎన్ఎస్టీ కమాండోలు కాగా, మిగతావారు ఆర్ముడ్ రిజర్వుడ్ విభాగానికి చెందిన వారు. ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతోపాటు హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది సీఎం భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.