సనత్ నగర్ : హైదరాబాద్ నగరంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో జనం రావణదహనం నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. సనత్‌నగర్‌లోని హనుమాన్ టెంపుల్లో, అమీర్‌పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి విజయానికి ప్రతీక దసరా అని చెప్పారు. ప్రజలంతా మంచిని పాటించాలని, చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రావణ దాహన కార్యక్రమాలను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో హాజరయ్యారు.