Road accident : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. ఆయన కారు డ్రైవర్ రంగారెడ్డి తీవ్రంగా గాయపడ్డరు. డీఎస్పీ తన పోలీస్ ఇన్నోవా వాహనంలో సీఎం పర్యటన ముగించుకొని మహబూబ్‌నగర్‌కు వస్తున్న క్రమంలో జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామం సమీపంలో మరో వాహనం ఢీకొట్టింది.
ఇన్నోవా కారు ముందుభాగం డ్యామేజ్ అయ్యింది. కారులో గాయాలతో ఉన్న డీఎస్పీని, ఆయన డ్రైవర్‌ను వెంటనే మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. డీఎస్పీ ముఖంపై, మోకాలికి గాయలైనట్లు తెలిసింది. ప్రస్తుత ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్వీఎస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.