జహీరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయలతో విరాజిల్లాతున్న భారత దేశంలో ఒక్కో ఊరిది ఒక్కోగాథ. పండుగలైన, పబ్బాలైన గ్రామస్థుల నమ్మకమే ఆనవాయితీగా వస్తుంది. అదే కోవకు చెందిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ ( Raghavpuram ) గ్రామానిది. గురువారం(Thursday) రోజున ఏ పండుగ వచ్చినా ఘాత వారంగా భావిస్తున్న గ్రామస్థులు దసరా పండుగను ఒకరోజు ( బుధవారం ) ముందుగానే ఘనంగా జరుపుకున్నారు.
దసరాను దేశమంతటా గురువారమే పండుగను జరుపుకుంటుంటే వీరు మాత్రం ఒక రోజు ముందే వారి ఆనవాయితీగా జరుపుకున్నారు. గత 50 సంవత్సరాలుగా గురువారం రోజున ఏ పండగ వచ్చిన ఒకరోజు ముందే పండుగలను నిర్వహించుకుంటున్నారు. భాజా భజంత్రీల మధ్య గ్రామస్థులందరూ ఊరేగింపుగా వెళ్లి జమీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దసరా వేడుకలను జరుపుకున్నారు. అనంతరం గ్రామంలో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.