 
                                                            Vakiti Srihari | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి అవమానం ఎదురైంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ జేఏసీ తలపెట్టిన ధర్మ దీక్షలో పాల్గొనేందుకు మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెళ్లారు. అయితే దీక్షకు అనుమతి లేదని చెప్పి పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్తో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఏసీపీకి మంత్రి శ్రీహరి ఫోన్ చేసి కోరినా అనుమతి ఇవ్వలేదు. పోలీసుల వైఖరికి తీవ్ర అవమానానికి గురై, ఎండలోనే దీక్షలో కూర్చున్నారు మంత్రి వాకిటి శ్రీహరి, విప్ బీర్ల ఐలయ్య. మండుటెండలోనే తమ ప్రసంగాన్ని కొనసాగించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఓయూ ప్రధాన రహదారిపై మంత్రి శ్రీహరి, బీర్ల ఐలయ్యతో పాటు బీసీ నాయకులు బైఠాయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మంత్రికి ఘోర అవమానం
దీక్షకు అనుమతి లేదంటూ టెంట్ ఎత్తుకెళ్లిన పోలీసులు.. ఎండలోనే కూర్చున్న మంత్రి వాకిటి శ్రీహరి, విప్ బీర్ల ఐలయ్య
ఓయూ యూనివర్సిటీ ఆర్ట్స్ క్యాంపస్ ముందు బీసీ జేఏసీ తలపెట్టిన ధర్మ దీక్షలో పాల్గొన్న బీసీ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ… pic.twitter.com/o6GroJPKxv
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025
 
                            