హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : మెడికల్ కాలేజీల్లో బుధవారం నుంచి 29 వరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ హెచ్వోడీలు తనిఖీలు చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమి, సహా పలు సమస్యలపై ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నోటీసులు జారీ చేసింది.
దీంతో మెడికల్ కాలేజీల్లో కలెక్టర్లతోపాటు వైద్యారోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ, డీహెచ్ రవీంద్ర నాయక్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, అకాడమిక్ డీఎంఈ శివ్రామ్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొననున్నారు. 29 వరకు తనిఖీలు కొనసాగనున్నాయి. వైద్య కాలేజీల్లో గుర్తించిన సమస్యలపై ఉన్నతాధికారులు, కలెక్టర్లు ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదికలు అందజేయనున్నారు.