Badibata | మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం మండల పరిషత్ పాఠశాల పోస్టర్‌ను కార్పొరేట్ స్థాయిలో రూపొందించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు జీ సంతోష్‌కుమార్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు వినూత్నంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఉచితంగా బుక్స్, యూనిఫామ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, డిజిటల్ క్లాస్ రూమ్, ప్యూరీఫైడ్ డ్రింకింగ్ వాటర్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్వంటి సదుపాయాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ పోస్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కాగా, నిరుడు ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు.