కొత్తగూడెం అర్బన్, జనవరి 9: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పూట గడవడం కూడా కష్టంగా ఉన్నదని ఆవేదన చెం దారు. మహాలక్ష్మి పథకాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెంలోని సూపర్‌బజార్ సెం టర్లో దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సం ఘం జిల్లా కన్వీనర్ మర్రి కృష్ణ మాట్లాడు తూ.. ఉచిత బస్సు పథకాన్ని కొనసాగిస్తుండటంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటే అర్హులైన ఆటోడ్రైవర్లకు జీవన భృతి కింద నెలకు రూ.15 వేలు అందించాలని, ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.