అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ( Srisailam project ) వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ( Jurala ) నుంచి శ్రీశైలానికి 44,888 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 875.90 అడుగులకు నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను 167.87 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
విద్యుదుత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 3,050 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల వరద ప్రవాహం , పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 8 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది.