– టీయుడబ్ల్యూజె (ఐజెయు) భద్రాద్రి జిల్లా కమిటీ సభ్యుడు మోదుగు ప్రభాకర్
జూలూరుపాడు, అక్టోబర్ 01 : జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆధ్వర్యంలో రేపు నిర్వహించే నిరసనలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు మోదుగు ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజక కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, రక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చారు.