హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ ( Gadari Kishore ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) పై ఫైర్ అయ్యారు. పుట్టిన నాటి నుంచి నేటి వరకు తన జీవతంపై రేవంత్‌కు క్లారిటీ లేదని విమర్శించారు. దొర కొడుకని ఒకరోజు , నల్లమల అడవి నుంచి వచ్చానని మరోరోజు , పేదోడు సీఎం కూర్చీల కూర్చుంటే ఓర్వడం లేదని ఇంకోసారి ఇలా పలుమార్లు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
గోడలకు సున్నం ( Whitewash ) వేసుకునే వ్యక్తిని సీఎం పదవిలో కూర్చుండ బెడితే ప్రజలకే సున్నం పెడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి చిన్నతనం నుంచే క్రిమినల్ మనస్తత్వమని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన సీఎం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ప్రకటించకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, బీఆర్ఎస్ నాయకులను తిట్టుడే ఎంచుకున్నారని విమర్శించారు.