బుధవారం 03 జూన్ 2020
Telangana - May 23, 2020 , 16:48:57

రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

నిర్మల్‌: రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలవల్లే వ్యవసాయరంగంలో నూతన ఒరవడి ప్రారంభమైందని చెప్పారు. నిర్మల్‌లో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టిపెట్టేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మార్కెటింగ్‌ను దృష్టిలోపెట్టుకుని డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. 


logo