హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకం అమలు లోపభూయిష్టంగా ఉన్నదని, సాంకేతిక సమస్యలతో అర్హులకు పథకం అందడంలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. ఇందిరమ్మ ఇండ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం సభ ప్రారంభంకాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తొలుత ప్రశ్నోత్తరా లు చేపట్టారు. గృహజ్యోతి పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానాలు ఇచ్చారు. దక్షిణ డిస్కంలో 25 లక్షలు, ఉత్తర డిస్కంలో 27 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.3,593 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వర్తించదని చెప్పారు. కోటికి పైగా కుటుంబాలుంటే 52 లక్షల కుటుంబాలకు (50 శాతం) పథకాన్ని అమలుచేస్తున్నామని వివరించారు.
గృహజ్యోతిలో సమస్యలనేకం: మధుసూదన్‌రెడ్డి
గృహజ్యోతి పథకం అమలులో సాంకేతిక సమస్యలున్నాయనే అంశాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి లేవనెతత్తారు. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన వారికే పథకాన్ని అమలుచేస్తున్నారని.. చేసుకోని వారి సంగతేమిటని ప్రశ్నించా రు. కొత్త రేషన్‌కార్డులు వ చ్చిన వారికి పథకం అమలే కావడంలేదని చెప్పారు. కొత్త ఇంటికి మారినప్పుడు కూడా సమస్య ఏర్పడుతున్నట్టు తెలిపారు. నెలలో 300 యూనిట్లు దాటి.. తదుపరి నెల 200 యూనిట్లలోపు ఉంటే జీరో బిల్లులు రావడంలేదని తెలిపారు. సమస్యలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వడంలేదు: కవ్వంపల్లి
ఇందిరమ్మ ఇండ్లకు కరెంట్ కనెక్షన్లు ఇవ్వడమే లేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. సైట్ ఓపెన్ కావడమే లేదని సభలో ప్రస్తావించారు. కొత్త ఇండ్లు కట్టుకున్న వారికి, ప్రజాపాలనలో గతంలో దరఖాస్తు చేసుకోని వారికి గృహజ్యోతి పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు.
లబ్ధిదారులు ఆరు లక్షలేనా?: దానం
హైదరాబాద్‌లో కోటికి పైగా జనాభా ఉంటే గృహజ్యోతి లబ్ధిదారులు ఆరులక్షల మందేనా? అని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. ఇంత పెద్ద నగరంలో తక్కువ లబ్ధిదారులు ఉండడమేమిటని ప్ర స్తావించారు. ఒక్కో నెల 215 యూనిట్లు దాటితే మొత్తం యూనిట్లకు బిల్లులు జారీచేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు రుణాలతో కార్లు కొని క్యాబ్‌లు నడుపుకొంటే బీపీఎల్ ఎగువన ఉన్నారని ప్రభుత్వ పథకాల కోత సరికాదన్నారు.