పైలట్ గ్రామానికే పైసలియ్యలే.. ప్రారంభించి 15 నెలలు.. పది ఇండ్లూ పూర్తికాలేదు
కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన బొల్లకొండలో సమయానికి పైసలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
- అప్పు చేసి లక్షలు ఖర్చు చేసినా రాని బిల్లులు
- వరంగల్ జిల్లా బొల్లకొండలో లబ్ధిదారుల నిరీక్షణ
నెక్కొండ, ఏప్రిల్ 26 : కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన బొల్లకొండలో సమయానికి పైసలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించి 15 నెలలు గడిచినా పట్టుమని పది ఇండ్లు పూర్తికాలేదు. సగం ఇండ్ల పనులు స్లాబ్ దశలోనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో గోడలకు ప్లాస్టింగ్, పెయింటింగ్ చేసుకోలేకపోయామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం లక్షలు అప్పు చేసినా పూర్తి కావడంలేదని కొందరు, భారాన్ని భరించలేమని మరికొందరు లబ్ధిదారులు వాపోతున్నారు.
నిబంధనలు సడలించి ఫైనల్ బిల్లు అందిస్తే ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసుకుంటామని వేడుకుంటున్నారు. ప్రభుత్వం తమ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో అందరికీ పక్కా ఇండ్లు వస్తాయని సంబురపడితే చివరికి కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయనే లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో మొత్తం 99 మందిని లబ్ధిదారులను గుర్తించి, గతేడాది ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గులు పోశారు. వాటిలో ఇప్పటివరకు 30 ఇండ్లను మొదలే పెట్టక పోవడం గమనార్హం. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏడు ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఏడుగురు లబ్ధిదారులు గృహప్రవేశం చేసి ఆరు నెలలు దాటుతున్నా వారికి చివరి బిల్లు ఇంకా రానేలేదు. స్లాబ్‌దశలో 50, రూఫ్ లెవల్లో 2, బేస్మెంట్ లెవల్లో మరో 10 ఇండ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
ఉన్న ఇల్లు పోయింది..
పెంకుటిల్లు తీసేసి అప్పు చేసి ఇంటి పనులు మొదలుపెట్టిన. స్లాబ్ పడగా ఒక్క బిల్లే వచ్చింది. ఎవరిని అడిగినా బిల్లు ఎప్పుడు వస్తదో చెప్తలేరు. బిల్లులు వస్తేనే పనులు జేస్తం. ఇల్లచ్చందన్న సుఖం లేదు. పాత ఇల్లు తీసి కొత్తది ఏస్తే అది ఇంకా అయితనేలేదు. పక్కింటోళ్ల జాగలో గూడు వేసుకొని ఉంటున్నం. వానొస్తే ఎక్కడ ఉండాల్నో?
-బానోత్ జుమ్మి
బిల్లు వస్తేనే పనులు
దర్వాజాలు, కిటీకీలు, లెంటల్ లెవల్ దాకా పనిజేసినం. అప్పు సప్పు చేసి మెల్లమెల్లగా కట్టుకుంటున్నాం. ఒక్కటే బిల్లు వచ్చింది. బిల్లులు వస్తేనే పనులు జేస్తం. లేకపోతే కష్టమే.
– ఓరుగంటి విజయలక్ష్మి
ఇంకా ఆఖరి బిల్లు రాలేదు ..
కొడుకు ఇల్లు కట్టుకొని ఆర్నెల్లయింది. ఇంకా ఆఖరి బిల్లు రాలే. ఎప్పుడు వస్తదో తెల్వదు. బిల్లుకోసం చూస్తూనే ఉన్నం.
– కమ్లీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

