Atmiya Bharosa | కొల్లాపూర్ రూరల్, మార్చి 7 : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ నాయకులు కోతలు విధిస్తున్నారు. ఇటీవల ఎన్మన్బెట్ల గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల్లో ఏడుగురు బీఆర్ఎస్కు ఓట్లు వేశారనే అనుమానంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. అర్హత లేని ఓ అంగన్వాడీ ఉద్యోగుస్తురాలికి ఇందిరమ్మ పథకం వర్తింపజేశారు.
కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా తొలగించిన ఏడుమందిలో చెన్నమ్మ (భర్త చనిపోయాడు), భాగ్యమ్మ (భర్త చనిపోయాడు), లాలమ్మ (కొడుకు మృతి చెందాడు), కూలీ పని తప్ప ఆధారం లేదు. మల్లమ్మ, మల్లేశ్వరితోపాటు మిగితావారికి పొలం కూడాలేదు. ఎలాంటి ఆధారంగా లేకుండా జీవిస్తున్న వారిపై కనికరం లేకుండా సంక్షేమ పథకాన్ని కట్ చేయడంతో స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు.