మాడల్ స్కూల్ టీచర్ల బదీలు చేపట్టాలని గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులు అరవింద్ ఘోష్, ఇష్రాద్అలీ, సాయిచరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 194 మాడల్ స్కూళ్లలో టీచర్లు 11 ఏండ్లుగా బదిలీలు లేక స్వస్థలాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
– చిక్కడపల్లి
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేటలో కొన్ని రోజులుగా మంచి నీళ్లు రావడం లేదని గురువారం మహిళలు బిందెలతో గ్రామంలోని వాటర్ ట్యాంకు వద్ద నిరసన తెలిపా రు. నీళ్ల పైపు పగిలిపోవడంతో నీళ్లు రావడం లేదని పంచాయతీ కార్యదర్శిని అడిగితే.. తనకు సిబ్బంది సహకరించడం లేదని చెప్పినట్టు మహిళలు పేర్కొన్నారు.
– కొమురవెల్లి