హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) జూలై సెషన్ ప్రవేశాల గడువును పొడగించారు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ కే రమేశ్, డిప్యూటీ డైరెక్టర్ రాజు బొల్లా తెలిపారు. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం www.ignou.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని వారు సూచించారు.
హెచ్ఎంఏ ఏడీపీ ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులను వ్యవస్థాపకులుగా మార్చేందుకు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసొసియేషన్ (హెచ్ఎంఏ)ఆధ్వర్యంలో అంత్రపెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఏడీపీ)ను ప్రారంభించింది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ వర్క్‌షాప్‌లో విద్యార్థులను భవిష్యత్తు ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడంపై శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో హెచ్ఎంఏ అధ్యక్షుడు అల్వాల దేవేందర్‌రెడ్డి, కార్యదర్శి వాసుదేవన్, చంద్రశేఖర్, నగేస్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.