Shamshabad Airport | హైదరాబాద్ : పర్యాటకుల కోసం మాల్దీవులకు ఇండిగో విమాన సర్వీసులను పున:ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం తెలిపింది. సుందరమైన మాల్దీవులను తిలకించేందుకు హైదరాబాద్ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను నడపాలని పర్యాటకుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో విమాన సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది.
మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి 6ఈ-1797 విమానం బయలుదేరి మధ్యాహ్నం 2.50గంటలకు మాలే ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మాలే నుంచి మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరే విమానం 6ఈ-1798 సాయంత్రం 6.45గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని తెలిపారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నాన్‌స్టాప్ ఫ్లైట్ ఉంటుందని పేర్కొన్నారు