‘బడుగుల ఆత్మగౌరవ ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ’
సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి నిలువెత్తు రూపం వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత త్యాగాలు చిరస్మరణీయమన్నారు.
– పాపకొల్లులో ఐలమ్మ వర్ధంతి
– నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, సెప్టెంబర్ 10 : సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి నిలువెత్తు రూపం వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత త్యాగాలు చిరస్మరణీయమన్నారు. జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. నాటి రజాకారులు, దొరలు, భూస్వాముల సాగించిన దోపిడీకి ఎదురొడ్డి నిలిచిన యోధురాలు ఐలమ్మ అని కీర్తించారు. పేదలు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువ తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికే కాకుండా భావితరాలకు సైతం నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, మాజీ ఉప సర్పంచ్ నిమ్మటూరి కనకయ్య, చాపలమడుగు రామ్మూర్తి, తాళ్లూరి రామారావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఇల్లంగి తిరుపతి, రామిశెట్టి వంశీ, ధర్మరాజుల పుల్లయ్య, వాంకుడోత్ బాబూలాల్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

