హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం దేశానికి సీఎం కేసీఆర్‌లాంటి ముందుచూపు ఉన్న నాయకత్వం అవసరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అభిప్రాయపడ్డారు. విద్యార్థి నాయకుడిగా మాజీ ప్రధాని నెహ్రూతో సహా అనేకమం ది నాయకులతో తాను కలిసి పనిచేశానని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చూసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కేశవరావు పేర్కొన్నారు.
తెలంగాణభవన్‌లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేశవరావు మాట్లాడారు. బీఆర్ఎస్కు బలం సీఎం కేసీఆర్, కార్యకర్తలే అని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయంలో కార్యకర్తలు గొప్ప పాత్ర పోషించారని గుర్తుచేశారు. ‘నేషనల్ మిషన్’తో పార్టీని ముందుకు తీసుకుపోవాలన్నారు.