Fake News | ప్రచారం: దేశ ఆర్థిక వ్యవస్థ తొలిసారి 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఐఎంఎఫ్ డాటా ఆధారంగా అన్ని దేశాలకు సంబంధించిన జీడీపీ లైవ్ ట్రాకింగ్ డాటా అంటూ ఓ స్క్రీన్ గ్రాబ్‌ను షేర్ చేస్తున్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఈ మైలురాయిని అధిగమించిందంటూ కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెఖావత్, కిషన్‌రెడ్డి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు ఎక్స్‌లో హర్షం వ్యక్తం చేశారు.

వాస్తవం: భారత్ 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందంటూ ప్రచురితమవుతున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇలా అన్ని దేశాల జీడీపీ గణాంకాలను లైవ్‌గా ట్రాక్ చేయడం చాలా కష్టం అని తెలిపాయి. మరోవైపు జీడీపీ 4 ట్రిలియన్లు దాటడంపై కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వెల్లడించలేదు.