హైదరాబాద్, జూన్ 20 (నమస్తేతెలంగాణ): వ్యవసాయ విద్యలో భారత్ ప్రపంచ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వీక్షిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యవసాయ విద్య భాగస్వామ్యం కావడం చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో శుక్రవారం జరిగిన ‘వ్యవసాయ విద్య, అవకాశాలపై వర్‌షాప్’లో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలు భారతీయ వ్యవసాయ విద్య వైపు చూస్తున్నాయని, అందుకే ఆవిషరణల వైపు విద్యార్థులు మొగ్గు చూపాలని కోరారు. భారత్ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగడంలో వ్యవసాయ ఆధారిత స్టార్టప్ పరిశ్రమల పాత్ర చాలా కీలకమని తెలిపారు.
ఇన్నాళ్లూ అక్కడే ఎందుకు పనిచేశారు? ; తొలిరోజు విచారణలో శ్రీధర్‌పై ఏసీబీ ప్రశ్నల వర్షం
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌పై శుక్రవారం తొలిరోజు విచారణలో ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన తర్వాత మళ్లీ అక్కడే పోస్టింగ్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై శ్రీధర్‌ను ప్రశ్నించడంతోపాటు ఇరిగేషన్‌శాఖలో ఆయన సాగించిన వసూళ్లపై ఆరా తీసినట్టు సమాచారం. శ్రీధర్‌పై ఈ నెల 11న కేసు నమోదు చేసిన ఏసీబీ.. అదే రోజు ఉదయం రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.