స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఓ అద్భుత ఘట్టం : మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఓ అద్భుత ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా మంత్రి స్వయంగా తయారు చేయించిన 3 వేల అడుగుల పొడవైన జాతీయజెండాను ప్రదర్శించారు.
అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ గీతాలాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రికార్డు స్థాయిలో మూడు కిలోమీటర్లు పొడవు జాతీయ జెండా ప్రదర్శించడం ఓ అద్భుత ఘట్టం అన్నారు.
స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన పోరాటయోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ 2 వారాల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబురాలకు రూపకల్పన చేశారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

